Tirumala News:తిరుమల భక్తులకు అలర్ట్.. పెరిగిన రద్దీ

by Jakkula.Mamatha |

శ్రీ వేంకటేశ్వరుని దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

Tirumala News:తిరుమల భక్తులకు అలర్ట్.. పెరిగిన రద్దీ
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీ వేంకటేశ్వరుని దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(శనివారం) శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వారాంతం ప్రారంభం కావడంతో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 31,439 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.49 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story