- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల వెళ్లేవారికి అలర్ట్.. క్యూలైన్ మూసివేసిన టీటీడీ!
తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్. ప్రస్తుతం క్యూలైన్ ను టీటీడీ తాత్కాలికంగా మూసివేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న కంపార్టుమెంట్లన్నీ భక్తులతో ఫుల్ అయిపోతున్నాయి. కొన్ని కంపార్టుమెంట్లలో భక్తుల్ని దర్శనానికి పంపగా.. వెంటనే ఆ కంపార్టుమెంట్లన్నీ మళ్లీ భక్తులతో నిండిపోతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకూ ఇదే పరిస్థితి ఉండటంతో.. టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యూలైన్ ఎంట్రీని తాత్కాలికంగా మూసివేశారు. రేపు ఉదయం 6 గంటల తర్వాతే తిరిగి క్యూలైన్లోకి రావాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ వారంలో భక్తుల రద్దీ తాళలేక క్యూలైన్ ను ఇలా తాత్కాలికంగా మూసివేయడం ఇది రెండోసారి. ఈ నెల 20న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ క్యూలైన్ మూసివేశారు. తిరిగి రాత్రి 8 తర్వాత క్యూలైన్ ఓపెన్ చేశారు. కాగా.. వేసవి సెలవులు, వరుసగా పరీక్షల ఫలితాలు వెలువడుతుండటంతో.. భక్తులు తమ పిల్లలతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకునేందుకు తిరుమలకు తరలివెళ్తున్నారు. దీంతో కొండపై భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఏసీ, నాన్ ఏసీ రూమ్ లు కూడా దొరక్క వందలాది మంది భక్తులు పడిగాపులు పడుతున్నారు. కొండపై భక్తుల కోసం ఏర్పాటు చేసిన లాకర్లు కూడా ఫుల్లై పోవడంతో.. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని భక్తులు టీటీడీ అధికారుల్ని కోరుతున్నారు.






