Tirumala:శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-10 14:47:37  IST  )

తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తుంటారు.

Tirumala:శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో  భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. ఈ తరుణంలో శ్రీవారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ కొన్నిసార్లు సాధారణంగానూ, కొన్ని సార్లు అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు(సోమవారం) శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాలలో తరలి రావడంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ(Vehicular traffic) ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గో మందిరం వరకు వాహనాలు బారులు తీరాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు చర్యలు చేపట్టి వాహనాల రద్దీని నియంత్రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న(ఆదివారం) శ్రీవారిని 84,536 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,890 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.67 కోట్లు వచ్చింది.

Next Story