Tirumala:భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

by Jakkula.Mamatha |

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) తరలి వస్తుంటారు.

Tirumala:భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో భక్తుల రద్దీ కొన్ని సార్లు అధికంగా, మరికొన్ని సార్లు సాధారణంగా ఉంటుంది.

ఈ క్రమంలో నేడు(బుధవారం) తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనాలకు 6 గంటల సమయం పడుతోంది. 1 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనాలకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) తిరుమల శ్రీవారిని 66,393 మంది భక్తులు(Devotees) దర్శించుకున్నారు. 19,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక తిరుమల హుండీ ఆదాయం(Hundi Income) 3.86 కోట్లు వచ్చింది.

Next Story