- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు అలర్ట్.. తిరుమలలో నేటి అర్ధరాత్రి వైకుంఠ ద్వారాల మూసివేత
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు వెల్లడించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు వెల్లడించింది. 9వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో యథావిధిగా అన్ని ప్రత్యేక దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు చివరి రోజుకు చేరుకున్నాయి. నేటి అర్ధరాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలకు తెరపడనుండగా, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.
గడిచిన తొమ్మిది రోజుల వ్యవధిలో టీటీడీ రికార్డు స్థాయిలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. మొత్తం 7,09,831 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 85,752 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు దర్శనాల షెడ్యూల్‌ను గమనించి ఆలయానికి రావాలని సూచించింది.






