- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఆలయం వెళ్లే భక్తులకు అలర్ట్.. భారీగా పెరగనున్న టికెట్ ధర.. ఎంతంటే?
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దర్శనానికి నిత్యం వందలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దర్శనానికి నిత్యం వందలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాణిపాకం గణేశుని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు(Devotees) వస్తుంటారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు వీఐపీ దర్శనం టికెట్ల పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వీఐపీ దర్శనం టికెట్ ధర రూ.300గా అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం పై కమిషనర్ అనుమతి కోసం నివేదించేందుకు సిద్ధమయ్యారు. కాణిపాకం(Kanipakam) స్వామి వారి ఆలయంలో ప్రస్తుతం సర్వదర్శనం రూ.100, రూ.150 టికెట్లపై భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఈ తరుణంలో వీఐపీ ద్వారం గుండా వెళ్లే భక్తులకు టికెట్ ధర రూ.300గా ప్రతిపాదించారు. కమిషనర్ అనుమతి తీసుకుని పదిహేను రోజుల్లో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఆలయ ఉద్యోగులు, వారికి కావాల్సిన వారు వచ్చిన కూడా టికెట్లు కొనుగోలు చేసి విధిగా దర్శనానికి వెళ్ళాలని ఆలయ ఈవో ప్రకటించిన విషయం తెలిసిందే






