Breaking:కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.

Breaking:కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం భర్తీ చేయబోతున్న 6,100 కానిస్టేబుల్ పోస్టులకు వచ్చే నెల(జూన్) 1వ తేదీన మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించిన 38,910 మంది తుది పరీక్షకు ఎంపికైనట్లు పోలీసు రిక్రూట్మెంట్‌ బోర్డు(SLPRB AP) తాజాగా వెల్లడించింది.

ఈ క్రమంలో తాజాగా మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హల్‌టికెట్ పొందవచ్చు. ఏవైన సమస్యలు ఉంటే 9441450639 హెల్ప్ లైన్ నెంబర్‌ను సంప్రదించాలి. ఈ క్రమంలో జూన్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి జిల్లాలో పరీక్షా కేంద్రాల్లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Next Story