- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు అలర్ట్..కొత్త పెన్షన్లపై కీలక ప్రకటన!
ఏపీ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు దరఖాస్తులను ఆహ్వానించబోతున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. కొత్త పెన్షన్లపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై, జూన్ 12 తో రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు దరఖాస్తులను ఆహ్వానించబోతున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. దీనిపై సర్కార్ అధికారిక ప్రకటన చేస్తే.. దాదాపు పది లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వితంతు పెన్షన్ కోసం 1.50 లక్షల మంది అర్హులు ఉంటారని తెలుస్తోంది.
10 లక్షలకు పైగా అప్లై చేసుకునే ఛాన్స్
ప్రస్తుతం పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే, స్పౌజ్ కేటగిరీలో వెంటనే భార్యకు పెన్షన్ ఇస్తున్నారు. అలాగే పెన్షన్ అందని భర్త చనిపోతే, వెంటనే వితంతు కేటగిరిలో పెన్షన్ ఇచ్చేందుకు కూడా సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. అదే సమయంలో తప్పుడు పత్రాలు సమర్పించి పెన్షన్ తీసుకుంటున్న వారిపై కూడా చర్యలకు పూనుకుంటోంది. అలాంటి తప్పుడు పెన్షన్ల ఏరివేత కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించింది కూటమి సర్కార్. న్యాయబద్ధంగా అర్హులైన వాళ్లకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.






