గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక లోపం

by Ramesh Naini |

గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక లోపం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా ఆగిపోయింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని నిలిపివేసి భద్రతా చర్యలు చేపట్టారు.

ఈ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఢిల్లీకి ప్రయాణించాల్సి ఉంది. సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణం వాయిదా పడడంతో ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి తిరిగి ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు బయలుదేరారు. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. సాంకేతిక లోపంపై సమగ్ర పరిశీలన చేపడుతున్నట్లు వెల్లడించారు.

Next Story