రియాలిటీలోకి ఏఐ, క్వాంటం టెక్నాలజీ

by Thanuru Gopichand |

ఏఐ, క్వాంటం టెక్నాలజీలు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

రియాలిటీలోకి ఏఐ, క్వాంటం టెక్నాలజీ
X

కొత్త ఆలోచనలు ఆవిష్కరణలు రావాలి

ప్రస్తుతం నాలెడ్జి ఎకానమీ దశలో ఉన్నాం

స్మార్ట్​ఫోన్​పెరిగిన ఆర్థిక, జీవన ప్రమాణాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

బీఎస్ఎన్ఎల్​4జీ సేవలు ఆవిష్కరణ

దిశ, డైనమిక్​ బ్యూరో / ఏపీ బ్యూరో: : ఏఐ, క్వాంటం టెక్నాలజీలు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్​లో ఇవాళ జరిగిన బీఎస్ఎన్ఎల్​4జీ సేవల ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. బీఎస్ఎన్ఎల్​నుంచి ఇంకా కొత్త, ఆలోచనలు, ఆవిష్కరణలు రావాలని కోరారు. ఏఐ ద్వారా రియల్​టైమ్​లో మెసేజ్​లు పంపే పరిస్థతి వస్తుందన్నారు. నడిపించే నాయకుడు లేక ఇన్నాళ్లూ దేశం అవస్థపడిందని, ప్రధాని మోడీ ఇప్పుడు సరైన నేత, సరైన స్థానంలో ఉన్నారని కొనియాడారు. అందుకే స్వదేశీ 4 జీ నెట్వర్క్ లాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. 1995 నుంచి దేశం టెక్నాలజీ పరంగా, సమాచార సాంకేతిక అంశాల్లో ముందుకు వెళ్లాలన్నది తన కల అన్నారు. గతంలో టెలికాం రంగంలో తాను ఇచ్చిన నివేదికతో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ నెట్వర్క్‌లో దేశంలో బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఓ శక్తివంతమైన సంస్థగా అభివర్ణించారు. ప్రస్తుతం 1 బిలియన్ సబ్ స్క్రైబర్లు బీఎస్ఎన్ఎల్‌కు ఉన్నారని చెప్పారు. భారత్ లో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ వంద దేశాల్లోని వారిని కాపాడిందన్నారు.

ఆ సమయంలోనే తీసుకువచ్చిన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ విధానం ఇప్పుడు ఫ్రాన్స్, సింగపూర్ లాంటి దేశాల్లోనూ వాడుతున్నారని తెలిపారు. భారత్ తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలు వినియోగిస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం నాలెడ్జి ఎకానమీ దశలో ఉన్నామని పేర్కొన్నారు. ఏపీలో మొబైల్ ఫోన్ ద్వారా 735 పౌరసేవలను వాట్సప్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. ఇది కేవలం 4జీ లాంటి సేవల ద్వారానే సాధ్యమైందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తయారైన సెల్ ఫోన్లు ప్రపంచ దేశాలు వాడుతున్నాయని పేర్కొన్నారు. 14.30 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపు మహిళలు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారని తెలిపారు. స్మార్ట్ ఫోన్ కారణంగా ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పారు.

2030 నాటికి 6జీ సేవలు

2030 నాటికి 6జి కూడా అందుబాటులోకి వచ్చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1 లక్ష 4జీ సైట్లను ఏర్పాటు చేసి 4 పెటా బైట్ల డేటాను రోజూ అందించేలా చేయటం అభినందనీయమన్నారు. మొత్తం 26,707 మారుమూల గ్రామాలను 4జీ టెక్నాలజీతో అనుసంధానించటం దేశప్రగతికి మరో కీలకమైన ముందడుగు అవుతుందని పేర్కొన్నారు. స్వదేశీ 4 జీ నెట్వర్క్ ప్రారంభించుకోవటం ఓ చారిత్రాత్మక దినమని చెప్పారు. 4జీ స్టాక్‌ను దేశీయంగా తయారు చేసే అతితక్కువ దేశాల్లో భారత్ ఒకటిగా మారిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా బీఎస్ఎన్ఎల్‌కు ప్రధాని మోడీ అదనపు నిధులు కేటాయించి శక్తివంతంగా తయారు చేశారని కొనియాడారు. ప్రధాని సూచిస్తే డిజిటల్​కరెన్సీపై రిపోర్టు ఇచ్చామని గుర్తు చేశారు. 2026 జనవరి నాటికి క్వాంటం వ్యాలీని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. రకరకాల యాప్స్ ద్వారా 90 శాతం విదేశీ కంపెనీలకు డబ్బు చెల్లిస్తున్నామని, ఈ పరిస్థితి ఇక మారాలని తెలిపారు. పేటెంట్స్‌లోనూ గరిష్టంగా నమోదు కావాలని, భారతీయలు నెంబర్ 1గా తయారు అవుతారని పేర్కొన్నారు.

Next Story