- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aghori : అఘోరీకి .. ఆస్తులు కోట్లలో?
సొంత కారులో సంచరిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉంటున్న అఘోరీకి కోట్లలో ఆస్తులు ఉన్నాయట.

* పెద్దవాళ్ళ కోసం స్మశానాల్లో పూజలు
* ఒక సినీ నటుడు ఇంటి పక్కనే రూ.8 కోట్ల విల్లా
* యూట్యూబ్ చానళ్లకు వెల్లడించిన వర్షిణి తల్లిదండ్రులు
దిశ డైనమిక్ బ్యూరో: సొంత కారులో సంచరిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉంటున్న అఘోరీకి కోట్లలో ఆస్తులు ఉన్నాయట..! అఘోరి ఆస్తులపై కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొద్దిరోజుల కిందట ఆమె వశం అయిన వర్షిని తిరిగి మంగళగిరిలోని (Mangalagiri) తన ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో వర్షిణీ తల్లిదండ్రులు అఘోరీ ఆస్తులకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. అఘోరీ స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకోసం పూజలు చేస్తుందని వెల్లడించారు. అలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు వసూళు చేస్తుందన్నారు. అలాగే ప్రభాస్ (Prabhas) ఇంటి పక్కన రూ.8 కోట్ల విలువైన విల్లా ఉంది.. అని అఘోరి చెప్పినట్లు వర్షిణి తల్లి వివరించారు. అలాగే యూట్యూబ్ ద్వారా రూ.20 లక్షలు వస్తాయని అఘోరీ వారితో చెప్పినట్లు వారు పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అఘోరీ ఐఫోన్ వాడుతున్నారు. ఎప్పుడు సొంతకారులోనే ప్రయాణం చేస్తుంటారు. తాను పాదయాత్ర చేస్తుండగా గత జనవరిలో భిక్షం వేశారని, దానిద్వారా కారు ఐఫోన్ కొనుక్కున్నారని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఘోరి తెలిపింది. ఒంటిపై బూడిద రాసుకొని తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న అఘోరిమాతకు కోట్లలో ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.






