- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెజవాడలో మళ్లీ వరదలు? మైకులతో పోలీసుల ప్రచారం!
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో మళ్లీ వరదలు వస్తాయంటూ ప్రచారం జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో మళ్లీ వరదలు వస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. గతేడాది విజయవాడలో భారీగా వరదలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇల్లు నీట మునిగిపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృంధాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి.
ఈ ఏడాది బుడమేరు కాలువ పొంగిపొర్లుతుందని, కాబట్టి మరోసారి వరద ముప్పు ఉందని ప్రచారం జరిగింది. దీంతో జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఆ ప్రచారానికి అధికారులు చెక్ పెట్టారు. విజయవాడలో మళ్లీ వరదలు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు. కాలనీలో తిరుగుతూ మైక్‌ల ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు.






