- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్పీ ఎన్నికల ఫలితాల్లో రప్పా రప్పా అంటే ఏంటో ప్రజలు చూపించారు: చంద్రబాబు
ప్రశాంతమైన కుప్పంలో రప్పా రప్పా రాజకీయం చేయాలని చూశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం సభలో ఆయన మాట్లాడుతూ... పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ ఎన్నికల్లో రప్పా రప్పా అంటే ఏంటో ప్రజలు చూపించారని సెటైర్లు వేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రశాంతమైన కుప్పంలో రప్పా రప్పా రాజకీయం చేయాలని చూశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం సభలో ఆయన మాట్లాడుతూ... పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ ఎన్నికల్లో రప్పా రప్పా అంటే ఏంటో ప్రజలు చూపించారని సెటైర్లు వేశారు. కుప్పం నుడి తనను ఎనిమిది సార్లు ప్రజలు గెలిపించారని, పార్టీ స్థాపించినప్పటి నుండి టీడీపీనే కుప్పం ప్రజలు గెలిపించారన్నారు. మీ రుణం తీర్చుకుంటానని చెప్పారు. కుప్పంలో నూటికి 80 శాతం ఓట్లు తెలుగుదేశానివే అని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని మండిపడ్డారు. ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వైసీపీ ఓ విషవృక్షం అని వ్యాక్యానించారు. రాష్ట్రంలో వైసీపీ అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు.
అభివృద్ధి యజ్ఞం చేపడుతోంటే... రాక్షసుల్లా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో సీమలో వైసీపీని 7 సీట్లకే పరిమితం చేశారు.. అయినా వాళ్లు మారలేదని వ్యాఖ్యానించారు. సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ ఉంది.. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్, హర్టీకల్చర్, అగ్రికల్చర్, పారిశ్రామిక రంగాల్లో సీమను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కుప్పంలోని అన్ని చెరువులను నింపుతున్నామని ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పరమసముద్రం చెరువు నిజమైన సముద్రంలా కన్పిస్తోందని అన్నారు. రాయలసీమకు నీళ్లిద్దామని నేను ప్రయత్నిస్తే... అసెంబ్లీలో నాడు అడ్డం పడ్డారని ఆరోపించారు. తిరిగి అధికారంలోకి రాగానే నాడు ఆగిన పనులు తిరిగి ప్రారంభించామన్నారు. నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ అని చెప్పారు.
అసెంబ్లీలో సమస్యలపై చర్చించాలని, సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కానీ వాళ్లు అసెంబ్లీని హేళనకు తిట్లకే పరిమితం చేశారన్నారు. సీమలో ఒకప్పుడు ముఠా రాజకీయాలు ఉండేవి.. ఫ్యాక్షన్ లేకుండా చేసిన పార్టీ టీడీపీ అని చెప్పారు. రాయలసీమను వైసీపీ ఎప్పుడూ రక్తపాతం చేయాలనే చూసేదని విమర్శించారు. టీడీపీ సీమలో నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందన్నారు. రాయలసీమలో పది రిజర్వాయర్లను నీటితో నింపామని అన్నారు. అక్కడ జలకళ సంతరించుకుందని, సరిగ్గా వచ్చే ఏడాదిలో చిత్తూరుకు కూడా నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ఈ ఏడాది ఎగువ రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షం పడిందని మనం ఒడిసి పట్టుకున్నామని అన్నారు. రిజర్వాయర్లన్నీ 80 శాతం మేర నిండుగా ఉన్నాయని , హంద్రీ నీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరందించామని చెప్పారు.






