‘తొలిసారి’ జనంలోకి జగన్‌.. ప్రజల రియాక్షన్ ఎలా ఉండబోతోంది?

by Kodari Anjali |   (  Updated:2024-04-28 12:45:51  IST  )

మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సీఎం జగన్ తొలిసారి జనంలోకి అడుగుపెట్టబోతున్నారు

‘తొలిసారి’ జనంలోకి జగన్‌.. ప్రజల రియాక్షన్ ఎలా ఉండబోతోంది?
X

దిశ, వెబ్‌డెస్క్: మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సీఎం జగన్ తొలిసారి జనంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జగన్ బహిరంగ సభ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12. 30కి తిరుపతి జిల్లా వెంకటగిరిలో, మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరులో బహిరంగ సభకు హాజరుకానున్నారు. సభ తర్వాత తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. ఇక జగన్ నిన్న (శనివారం) తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో కలిసి లాంఛనంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రతం వంటి హామీలను ఇచ్చి.. అవన్నీ తీర్చే బాధ్యత నాదని జగన్ భరోసా ఇచ్చారు.

Next Story