- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిరెడ్డి అరెస్ట్ డైవర్షన్ డ్రామా
by Kodari Anjali |
తెలుగుదేశం పార్టీ కీలక నేత ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేయడంపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ కీలక నేత ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేయడంపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కన్నుని పొడిచిన మరో కన్నుని సీబీఐ అరెస్ట్ చేసే వేళ, ఆదిరెడ్డి కుటుంబాన్ని సీఐడీ అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా అని లోకేశ్ విమర్శించారు. ఫిర్యాదులు లేని కేసుల్లో టీడీపీ బీసీ నేతలైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులని అదుపులోకి తీసుకోవడం ఏ1 దొంగ పాలనలోనే సాధ్యం అని లోకేశ్ వ్యాఖ్యానించారు. వైసీపీలో చేరలేదనే అక్కసుతో ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష కట్టడం దారుణమన్నారు. ఆదిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అని లోకేశ్ హామీ ఇచ్చారు.
Next Story






