- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బకింగ్ హామ్ కెనాల్ పై ఆ ప్రచారమంతా అవాస్తవం : ADCL
బకింగ్ హామ్ కెనాల్ పై ఐరన్ గడ్డర్లు ఒరిగాయని కొద్దిరోజులుగా సోషల్ మీడియా, కొన్ని ప్రాంతీయ వేదికలపై జరుగుతున్న ప్రచారంపై అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పందించింది.

దిశ, వెబ్‌డెస్క్: బకింగ్ హామ్ కెనాల్ పై ఐరన్ గడ్డర్లు ఒరిగాయని కొద్దిరోజులుగా సోషల్ మీడియా, కొన్ని ప్రాంతీయ వేదికలపై జరుగుతున్న ప్రచారంపై అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పందించింది. గడ్డర్లు ఒరిగాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేసింది. స్టీల్ వంతెనను నిర్మించేటపుడు గడ్డర్లను తయారు చేసి.. వాటిని జాయింట్ చేసి, బేరింగులపై అమరుస్తారని ఏడీసీఎల్ అధికారులు వెల్లడించారు. కొన్నిసార్లు ఐరన్ గడ్డర్ల జాయింట్లను విడదీసి సరిచేస్తారని తెలిపారు. బకింగ్ హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ వంతెన ప్రస్తుతం సురక్షితంగానే ఉందని, వంతెన నిర్మాణంలో ఏ భాగాలనూ తొలగించలేదని అధికారులు వెల్లడించారు. వంతెన నిర్మాణంలో జరిగే సాధారణ సాంకేతిక సర్దుబాట్లను (Alignment Corrections) కొందరు తప్పుగా అర్థం చేసుకుని లేదా ఉద్దేశపూర్వకంగా గడ్డర్లు ఒరిగాయంటూ అవాస్తవాలను ప్రచారం చేశారని అధికారులు తేల్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు నిబంధనల ప్రకారమే, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయని ADCL నిర్ధారించింది.






