- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: పోసాని ఆరోగ్యంపై పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని నటి పూనం కౌర్ అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని నటి పూనం కౌర్ అన్నారు. గతంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan), పూనం కౌర్(Poonam Kaur)పై పోసాని అసభ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే పూనం కౌర్ తాజాగా పోసాని పట్ల సానుభూతి చూపిస్తూ ఆయన ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీ(Ap)లో రాజకీయాలు దారుణంగా మారాయన్నారు. బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. పోసాని వ్యాఖ్యలతో తాను వ్యక్తిగతంగా ఇబ్బంది పడినా ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై బెంగగా ఉందని చెప్పారు. పోసాని ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పూనం కౌర్ పేర్కొన్నారు.
కాగా చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్, లోకేశ్(Lokesh)పై గతంలో పోసాని అసభ్య వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో నమోదు అయిన కేసులో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన అస్వస్థతకు గురికావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో మళ్లీ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పోసాని ఆరోగ్యంపై సినీ నటి పూనం కౌర్ ట్వీట్ చేశారు.






