Taraka Ratna Health:అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. కాసేపట్లో హెల్త్ బులెటిన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-16 11:09:53  IST  )

సినీనటుడు తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కోమా నుంచి తారకరత్న బయటపడలేదని ఆస్పత్రి వర్గాల నుంచి తెలుస్తోంది..

Taraka Ratna Health:అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. కాసేపట్లో హెల్త్ బులెటిన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీనటుడు తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కోమా నుంచి తారకరత్న బయటపడలేదని ఆస్పత్రి వర్గాల నుంచి తెలుస్తోంది. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతుంది. ఎంత వైద్యం చేసినా మెరుగుపడకపోవడంతో విదేశాలకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు భావించారు.

అయితే కర్ణాటక హెల్త్ మినిస్టర్ చొరవతో విదేశీ వైద్యులు తారకరత్నకు చికిత్స నిమిత్తం బెంగళూరుకు చేరుకున్నారు. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. తారకరత్నకు గుండె సహా మెదడుకు సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్‌ను అందిస్తున్నారట. కోమాలో ఉన్న తారకరత్నను స్పృహలోకి తీసుకు రావటానికి వైద్యులు న్యూరో ట్రీట్మెంట్ ఇస్తున్నారని తెలుస్తోంది.

అయితే తారకరత్న ట్రీట్మెంట్‌కు సంబంధించి గురువారం ఉదయం స్కానింగ్, పరీక్షలు చేశారని తెలుస్తోంది. నేటి సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం తారకరత్న హెల్త్ కండీషన్‌పై బులెటిన్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇకపోతే తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆయన బాబాయ్, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ నిరంతరం పర్యవేక్షిస్తు్న్న సంగతి తెలిసిందే.

Next Story