ఏం కావాలి ఇంతకన్నా.. చాలు ఈ జన్మకి: హీరో తనిష్ ఎమోషనల్ ట్వీట్

by Vemula.Srinu Prasad |

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ హీరో, ఆ పార్టీ నేత తనిష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి..

ఏం కావాలి ఇంతకన్నా.. చాలు ఈ జన్మకి: హీరో తనిష్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Janasena Chief, Ap Deputy Cm Pawan Kalyan)ను టాలీవుడ్ హీరో, ఆ పార్టీ నేత తనిష్(Hero Tanish)మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పవన్ కల్యాణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. "ఏం కావాలి ఇంతకన్నా.. చాలు ఈ జన్మకి" అంటూ తనిష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జనసేనానిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ కట్టే కాలేంత వరకు తాను కల్యాణ్ సర్‌తోనే ఉంటానని తనిష్ స్పష్టం చేశారు.

రామ్ తాళ్లూరిపై తనిష్ ప్రశంసలు


ఈ సందర్భంగా జనసేన నాయకుడు రామ్ తాళ్లూరి(Ram Talluri)పై కూడా తనిష్ ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లో తనకు అండగా నిలిచి, ముందుకు నడిపిస్తున్నందుకు రామ్ తాళ్లూరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "రామ్ తాళ్లూరి ఇచ్చిన ప్రోత్సాహానికి ఈ జన్మలో రుణం తీర్చుకోలేను" అంటూ తన కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు. పవన్ కల్యాణ్‌ను కలిసేలా చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు తనిష్ ధన్యవాదాలు తెలిపారు.

సినీ రంగానికే పరిమితం కాకుండా..

కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా, సమాజ సేవలోనూ భాగం కావాలని తనిష్ నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజల(Telangana People) శ్రేయస్సు కోసం జనసేన పార్టీ(Janasena Party) తరపున నిరంతరం పని చేస్తూనే ఉంటానని ఆయన ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు తన వంతు కృషి చేస్తానని హీరో తనిష్ వెల్లడించారు.

తనిష్ ట్వీట్..

Next Story