సీఎం చంద్రబాబును కలిసిన నటుడు సోనూసూద్

by Jakkula.Mamatha |

ప్రముఖ సినీ నటుడు, వ్యాపారవేత్త సోనూ‌సూద్(film actor Sonu Sood)నేడు(సోమవారం) అమరావతి(Amaravati)లోని ఏపీ సచివాలయానికి(AP Secretariat) వెళ్లారు.

సీఎం చంద్రబాబును కలిసిన నటుడు సోనూసూద్
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు, వ్యాపారవేత్త సోనూ‌సూద్(film actor Sonu Sood)నేడు(సోమవారం) అమరావతి(Amaravati)లోని ఏపీ సచివాలయానికి(AP Secretariat) వెళ్లారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వాని(AP Government)కి సోనూసూద్ ఫౌండేషన్(Sonusood Foundation) నాలుగు అంబులెన్స్‌(Ambulance)లను విరాళాంగా ఇవ్వనున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్ ఈ అంబులెన్స్ లను అందించనుంది. ఈ నేపథ్యంలో నటుడు సోనూసూద్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును(CM Chandrababu) కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్.. అంబులెన్స్‌లను ప్రభుత్వానికి అప్పగించారు.

అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ విషయంలో సోనూసూద్ ఫౌండేషన్ భాగస్వామి అయినందున ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ(Delhi) నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టు(Gannavaram Airport)కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర సచివాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Next Story