ఆ తత్వాన్ని అందరిలో చూడలేం: పవన్‌ కల్యాణ్‌పై నటుడు అడవి శేష్ ప్రశంసలు

by Vemula.Srinu Prasad |

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నాయకత్వ లక్షణాలపై ప్రముఖ టాలీవుడ్ నటుడు అడివి శేష్ ప్రశంసలు కురిపించారు...

ఆ తత్వాన్ని అందరిలో చూడలేం: పవన్‌ కల్యాణ్‌పై నటుడు అడవి శేష్ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్(Ap Deputy Cm, Janasean Chief Pawan Kalyan) నాయకత్వ లక్షణాలపై ప్రముఖ టాలీవుడ్ నటుడు అడివి శేష్(Tollywood actor Adivi Sesh) ప్రశంసలు కురిపించారు. నిజమైన నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ప్రజల కష్టాలపై స్పందించే హృదయమని, ఆ గుణం పవన్ కల్యాణ్‌లో పుష్కలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం నిరంతరం తపించే పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకమని శేష్ అభిప్రాయపడ్డారు.

అది ఆయన ప్రత్యేకత

ప్రజలు ఎదుర్కొనే వివిధ సమస్యల పట్ల పవన్ కల్యాణ్ చూపే నిబద్ధత, చొరవ అసాధారణమైనవని అడివి శేష్ కొనియాడారు. ప్రజల బాధలను విన్న వెంటనే వాటిని పరిష్కరించేందుకు ఆయన తక్షణమే స్పందిస్తారని, అలాంటి తత్వం అందరిలోనూ చూడలేమని చెప్పారు. సామాన్యుల కష్టాలను తన కష్టాలుగా భావించి ముందుకు సాగడం పవన్ ప్రత్యేకతని అడవి శేష్ వివరించారు.

నిజమైన ప్రజా నాయకుడు..

సమస్యలపై అంతటి స్పందన, సమాజం పట్ల బాధ్యత కలిగిన పవన్ కల్యాణ్ నిజమైన ప్రజా నాయకుడని శేష్ స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటూ ప్రజల హృదయాల్లో ఆయన స్థానం సంపాదించుకున్నారని అడవి శేష్ కొనియాడారు

Next Story