- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంతబాబుకు ఇన్‌సైడ్ ఇన్ఫో.. సర్పవరం సీఐ రవికుమార్‌పై వేటు
మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలీసుల అంతర్గత కదలికలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్న సర్పవరం సీఐ రవికుమార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం కాకినాడలో చర్చనీయాంశమైంది. ..

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు(Former Mlc Ananthababu)కు పోలీసుల అంతర్గత కదలికలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్న సర్పవరం సీఐ రవికుమార్(Sarpavaram Ci Ravikumar)పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం కాకినాడ(Kakinada)లో చర్చనీయాంశమైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు(Driver Subrahmanyam Murder Case)లో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబుకు, దర్యాప్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన మరియు రహస్య సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలు సీఐపై బలపడ్డాయి. ఖాకీ డ్రెస్ వేసుకుని నేరస్థుడికి కొమ్ముకాస్తున్నారన్న ఫిర్యాదులతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
విధుల్లో నుంచి తప్పిస్తూ నిర్ణయం
ఈ నేపథ్యంలో సీఐ రవికుమార్‌ను తక్షణమే విధుల్లో నుంచి తప్పిస్తూ ఏలూరు రేంజ్ ఐజీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు పారదర్శకతను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు ఆయనను వీఆర్‌కు (Vacation Relief) పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.






