- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు: విద్యుత్ శాఖలో 69 మంది ఉద్యోగుల డిస్మిస్
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో నకిలీ విద్యార్హత పత్రాలతో కొలువులు పొందిన వారిపై వేటు పడింది. ...

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL)లో నకిలీ విద్యార్హత పత్రాలతో కొలువులు పొందిన వారిపై వేటు పడింది. షిఫ్ట్ ఆపరేటర్లుగా విధుల్లో చేరిన 69 మంది ఉద్యోగులు అసలు ఐటీఐ (ITI) చదవకుండానే దొంగ సర్టిఫికెట్లు సమర్పించినట్లు విచారణలో స్పష్టమైంది. ఈ అక్రమం బయటపడటంతో ఉన్నతాధికారులు సదరు సిబ్బందిని విధుల్లోంచి తొలగించారు. శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.
అత్యధికంగా కడప జిల్లా వాసులు
ఈ తొలగింపులో అత్యధికంగా కడప జిల్లాకు చెందిన 38 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు కర్నూలు జిల్లాలో 16 మంది, చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ముగ్గురు చొప్పున అలాగే అన్నమయ్య జిల్లాలో ఒకరిని డిస్మిస్ చేశారు. జిల్లాల వారీగా జరిగిన ఈ తనిఖీల్లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అభ్యర్థుల సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నియామకాలు చేపట్టాలని అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు.






