- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిన్నీస్ రికార్డులు సాధించడం అభినందనీయం : సీఎం
జాతీయ రహదారుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ సహకారం.

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (Economic Corridor) పనుల్లో భాగంగా నాలుగు గిన్నిస్ రికార్డులు (Guiness Record) సాధించడం అభినందనీయమని సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అన్నారు. ఈ విషయమై వర్చువల్ గా నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nithin Gadkari) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నీస్ రికార్డులు సాధించటంపై అందరినీ అభినందిస్తున్నాని సీఎం తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్ధ్యం దేశంలో అందరికీ పరిచయమేనని అన్నారు. రాజ్ పథ్ ఇన్ ఫ్రా కామ్ సంస్థ వేగంగా అత్యంత పొడవైన బిటుమిన్‌తో కూడిన 6 లేన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించిందన్నారు. 10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ నిరంతరాయంగా వేస్తూ మరో ప్రపంచ రికార్డు సాధించిందన్నారు. జనవరి 6 నుంచి 11 వరకూ ఏక బిగిన 52 కిలోమీటర్ల మేర 6 లేన్ కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారని, అలాగే 84.4 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారిని నిర్మించిన రికార్డును తిరగరాశారని కొనియాడారు. బృందంగా పనిచేసి విజయం సాధించిన అందరికీ అభినందనలు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు.
ఏపీ కూడా భాగస్వామి కావాలని కోరుతున్నాను : కేంద్రమంత్రి
వరిగడ్డి ద్వారా బిటుమిన్ తయారీకి సంబంధించి కొత్త ఆవిష్కరణ చోటు చేసుకుంది. దానిని ఉపయోగించటంలో ఏపీ కూడా భాగస్వామి కావాలని కోరుతున్నాను అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కొత్త ఆవిష్కరణల ద్వారా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. నైపుణ్యం, ఆవిష్కరణలు, మేధోపరమైన ఆలోచనలు మరింతగా వచ్చి వ్యయాన్ని తగ్గించి నాణ్యతను పెంచాలని ఆకాంక్షించారు. అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్య రహిత విధానాలు అవలంబించాల్సి ఉందన్నారు. భగవాన్ సత్యసాయి బాబా ఆశీర్వాదంతో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గిన్నీస్ ప్రపంచ రికార్డులను సాధించగలిగామని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులను చేపట్టేందుకు ఏపీ నుంచి పూర్తి సహకారం అందుతోందని ఈ సందర్భంగా ప్రకటించారు. రవాణా వ్యయం 9 శాతం కంటే తక్కువగా పరిమితం అయ్యేలా మనం అంతా పనిచేయాల్సి ఉందన్నారు. లాజిస్టిక్స్ వ్యయం తగ్గటం ద్వారా మెరుగైన ఫలితాలను, వృద్ధిని సాధించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించేందుకు మేం సర్వదా సిద్ధమని హామీనిచ్చారు. రికార్డులను సాధించటంలో సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలను తెలియజేశారు.






