నకిలీ మద్యం కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జనార్ధన్‌రావు

by Vemula.Srinu Prasad |

నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులకు నిందితుడు జనార్ధన్‌రావు ఊహించని షాక్ ఇచ్చారు...

నకిలీ మద్యం కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జనార్ధన్‌రావు
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో ఎక్సైజ్ పోలీసులకు నిందితుడు జనార్ధన్‌రావు(Accused Janardhan Rao) ఊహించని షాక్ ఇచ్చారు. ఈ కేసులో జనార్ధన్‌రావును మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు జనర్ధన్ రావు సమాధానాలిచ్చారు. అయితే చివర్‌లోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. కస్టడీ రిపోర్టుపై సంతకం చేయలేదు. దీంతో ఎక్సైజ్ పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అన్ని ప్రశ్నలకు ప్రశాంతంగా జవాబులిచ్చి రిపోర్టుపై మాత్రం సంతకం చేయకపోవడంతో ఉలిక్కిపడ్డారు. విచారణ వివరాలకు అధికారిక ధృవీకరణ ఎలా అన్న దానిపై పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు జనార్ధన్‌రావును మదనపల్లె ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. నిందితుడి సంతకం లేకపోయినా చట్టపరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

Next Story