శ్రీశైలం పాతాళగంగలో ప్రమాదం

by Gantepaka Srikanth |

శ్రీశైలం(Srisailam) పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది.

శ్రీశైలం పాతాళగంగలో ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం(Srisailam) పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం శ్రీశైలం రోప్‌వే దగ్గర కొండచరియలు(Landslides) విరిగిపడ్డాయి. భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా శ్రీశైలంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో తరచూ తెలంగాణ వైపునకు వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవలే భారీవర్షాల కారణంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద తెల్లవారుజామున కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో యాత్రికులు చాలా ఇబ్బంది పడ్డారు. బస్సులు కదలకపోవడంతో వందలాది మంది యాత్రికులు అవస్థలు పడ్డారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో అల్పాహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా వారంలో రెండోసారి కొండచరియలు విరిగిపడటం కలకలం రేపుతోంది.

Next Story