శ్రీకాకుళంలో ఏసీబీ పంజా.. సోంపేట ABCWO నివాసంలో ఆకస్మిక సోదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-02 05:08:32  IST  )

రాష్ట్రంలో అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేసి కేసులు బుక్ చేస్తున్నా.. లంచాల పర్వం కొనసాగుతూనే ఉంది.

శ్రీకాకుళంలో ఏసీబీ పంజా.. సోంపేట ABCWO నివాసంలో ఆకస్మిక సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా, సోంపేట అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (ABCWO) గడ్డి బాల ముకుందరావు లక్ష్యంగా అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. సోంపేట డివిజన్ పరిధిలోని బీసీ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన డైట్ ఛార్జీల బిల్లుల మంజూరు కోసం బాల ముకుందరావు లంచం డిమాండ్ చేసినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే బాల ముకుందరావు నివాసంతో పాటు పలుచోట్ల ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story