- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికలాంగుడినీ వదలని అధికారులు.. భరతం పట్టిన ఏసీబీ
కడప రిమ్స్‌లో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపింది...

దిశ, వెబ్ డెస్క్: అవినీతి(Corruption)పై ఏసీబీ అధికారులు(ACB officials) ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ లంచం మాట వినిపించినా టక్కున వాలిపోతున్నారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. లంచం మహమ్మారిని రెడ్ హ్యాండెడ్ పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల అన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తనిఖీ నిర్వహించి పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అయినా సరే కొందరు అధికారుల్లో మార్పలు రావడంలేదు. లంచం కోసం పాకులాడుతూనే ఉన్నారు. అమాయకుల నుంచి డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. ఈ అవినీతి విషయం ఏసీబీ అధికారుల వరకూ వెళితే చర్యలకు గురై ఇంటికి పరిమితమవుతున్నారు.
కడప రిమ్స్‌లోనూ...
ఇలాంటి ఘటన రాష్ట్రంలో తాజాగా ఒకటి చోటు చేసుకుంది. కడప రిమ్స్(Kadapa Rims)లో సదరం నిర్వహించారు. ఈ సదరం శిబిరానికి వికలాంగులు హాజరయ్యారు. అయితే ఈ సర్టిపికెట్ ఇచ్చేందుకు సదరం వింగ్ సూపరింటెండెంట్ సుబ్బయ్య, అసిస్టెంట్ వెంకటేశ్వర్లు రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ(ACB)కి అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కడప రిమ్స్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో వాళ్లిద్దరూ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు అధికారులు సుబ్బయ్య, వెంకటేశ్వర్లుపై శాఖా పరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అధికారులు లంచం డిమాండ్ చేయడం నేరమని, ఎవరైనా అడిగితే తమను సంప్రదించాలని, అట్టివారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.






