ఏసీబీ రైడ్స్.. అడ్డంగా బుక్కైన హెడ్ కానిస్టేబుల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-01 10:26:15  IST  )

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు....

ఏసీబీ రైడ్స్..  అడ్డంగా బుక్కైన హెడ్ కానిస్టేబుల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. లంచం తీసుకుంటున్నారనే సమాచారం తెలిసిన వెంటనే రైడ్స్ చేస్తున్నారు. లంచగొండి అధికారుల భరతం పడుతున్నారు. రెడ్ హ్యాండెడ్ పట్టుకుని చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకూ ఎంతో మంది అవినీతి అధికారులను జైలుకు పంపినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట లంచాధికారులు ఏసీబీకి చిక్కిపోతూనే ఉన్నారు. లంచం డబ్బుతో పట్టుబడుతున్నారు.

తాజాగా కర్నూలు(Kurnool)లో ఏసీబీ(ACB) అధికారుల రైడ్స్ కలకలం రేగింది. ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఏసీబీ సోదాలు చేసింది. రూ. 80 లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ రవిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసు పనిపై స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి నుంచి హెడ్ కానిస్టేబుల్ లంచం డిమాండ్ చేశారు. లంచం ఇచ్చుకోలేనని చెప్పినా వినలేదు.. డబ్బులు ఇస్తేనే‌ పని జరుగుతుందని తేల్చి చెప్పారు. దీంతో ఏసీబీ అధికారులకు బాధితుడు సమాచారం అందించారు. దీంతో లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ రవిని అదుపులోకి తీసుకున్నారు. లంచం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. అనంతరం శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Next Story