ప్రభుత్వ ఆఫీసులో లంచం భూతం.. ఏసీబీకి అడ్డంగా చిక్కిన సీనియర్ అసిస్టెంట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-31 11:14:23  IST  )

ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కారు.....

ప్రభుత్వ ఆఫీసులో లంచం భూతం.. ఏసీబీకి అడ్డంగా చిక్కిన సీనియర్ అసిస్టెంట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ(Acb) అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కారు. లంచం తీసుకోవడం తప్పు అని తెలిసి కూడా కొందరు ఉద్యోగులు పరాయి సొమ్ము కోసం పాకులాడుతున్నారు. ప్రభుత్వ సేవల కోసం వచ్చిన వాళ్లను లంచం డిమాండ్ చేస్తున్నారు. అప్పన్నంగా అందినాకాడికి దోచేస్తున్నారు. కొన్ని సమయాల్లో కథ అడ్డం తిరిగి జైలుకు కూడా వెళ్తున్నారు.

తాజాగా లంచం తీసుకున్న ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం(Atmakur RDO Office)లో పని నిమిత్తం ఓ వ్యక్తి కాళ్లు అరిగేలా తిరిగారు. అయితే పని జరగలేదు. దీంతో మరో మార్గం ఉందని, రూ. 40 వేలు ఇస్తే పని పూర్తి అవుతుందని సదరు వ్యక్తికి సీనియర్ అసిస్టెంట్ రమేశ్ సలహా ఇచ్చారు. అయితే లంచం ఇచ్చుకోలేక ఏసీబీ అధికారులను ఆ వ్యక్తి ఆశ్రయించారు. దీంతో సీనియర్ అసిస్టెంట్ రమేశ్‌ను పథకం ప్రకారం పట్టుకున్నారు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా సదరు అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శాఖా పరమైన చర్యలకు ఆదేశించారు.

Next Story