- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూమి మ్యుటేషన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన వీఆర్వో
by Vemula.Srinu Prasad |
అనకాపల్లి జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. దీంతో పి. భీమవరం గ్రామ రెవెన్యూ అధికారి పోతల శంకరరావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు...

X
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District)లో ఏసీబీ అధికారులు(ACB Officials) మెరుపు దాడి చేశారు. దీంతో పి. భీమవరం(P. Bhimavaram) గ్రామ రెవెన్యూ అధికారి (VRO) పోతల శంకరరావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. భూమి మ్యుటేషన్(Land Mutation) ప్రక్రియను పూర్తి చేసేందుకు రైతు నుంచి శంకరరావు రూ. 70 వేలు డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్ వేసి లంచం తీసుకుంటుండగా వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడిలో పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు.. వీఆర్వో శంకరరావుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చక్కబెట్టేందుకు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఇవ్వొద్దని, వెంటనే తమకు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు.
Next Story






