ఏసీబీ కోర్టులో మద్యం కేసు నిందితుల పిటిషన్.. విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |

ఏపీ మద్యం కేసు విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.,..

ఏసీబీ కోర్టులో మద్యం కేసు నిందితుల పిటిషన్.. విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(Ap Liquor Case) విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court) ఈ నెల 7కు వాయిదా వేసింది. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు ఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy), వైసీపీ నేతలు సజ్జల శ్రీధర్ రెడ్డి,చాణక్య,దీలిప్ తరపున పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. చాణక్య బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 7న ఉత్తర్వులు ఇస్తామన్నారు. మిగిలిన వాళ్ల బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

గత ప్రభుత్వం నిర్వహించిన మద్యం అమ్మకాలల్లో అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ దర్యాప్తును సిట్‌కు అప్పగించింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డితో సహా మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం నిందితులు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story