- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ కస్టడీకి ఏసీ శాంతి: చిన్నారి కోసం ఆవేదన
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెను.. ఈనెల 15, 16 తేదీల్లో విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది.

దిశ, వెబ్ డెస్క్: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెను.. ఈనెల 15, 16 తేదీల్లో విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ రెండు రోజుల పాటు అధికారులు ఆమెను లోతుగా విచారించి, అక్రమాస్తుల మూలాలను వెలికితీసే అవకాశం ఉంది.
మరోవైపు తన రెండేళ్ల చిన్న బాబును చూసుకునేందుకు ప్రతిరోజూ జైలులో ములాఖాత్‌కు అవకాశం కల్పించాలని కోరుతూ శాంతి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. చిన్నారి సంరక్షణ దృష్ట్యా మానవతా దృక్పథంతో అనుమతి ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోరారు. ఈ విన్నపంపై సుదీర్ఘంగా చర్చించిన కోర్టు, తన నిర్ణయాన్ని ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
ప్రస్తుతం ఏసీబీ అధికారులు శాంతి బినామీ ఆస్తులు, లావాదేవీలపై దృష్టి సారించారు. కస్టడీ సమయంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. అటు చిన్నారి ములాఖాత్ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






