Liquor Case: రూ.11 కోట్లను వేరుగా ఉంచండి.. ACB కోర్టు ఆదేశాలు

by Gantepaka Srikanth |

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు(AP Liquor Scam Case)లో కీలక నిందితుడు రాజ్‌ కెసిరెడ్డి(Raj K.C. Reddy) ఏసీబీ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Liquor Case: రూ.11 కోట్లను వేరుగా ఉంచండి.. ACB కోర్టు ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు(AP Liquor Scam Case)లో కీలక నిందితుడు రాజ్‌ కెసిరెడ్డి(Raj K.C. Reddy) ఏసీబీ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కాచారంలో సిట్‌ సీజ్‌ చేసిన రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా రాజ్ కేసిరెడ్డి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు(ACB Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల పంచనామా నివేదికను సమర్పించాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. రూ.11 కోట్లను వేరుగా ఉంచాలని ఆదేశించింది.

మరోవైపు.. ఫాంహౌస్‌ యజమాని విజయేందర్‌రెడ్డికి పలు వ్యాపారాలున్నాయని రాజ్‌ కెసిరెడ్డి అంటున్నారు. ఆయనకు ఇంజినీరింగ్‌ కాలేజీ, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఉన్నాయని.. ఆయా కంపెనీలకు రూ.వందల కోట్ల టర్నోవర్‌ ఉందని రాజ్‌ కెసిరెడ్డి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Next Story