- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎస్ సంజయ్‌కు ఊరట.. బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది...

దిశ, వెబ్ డెస్క్: నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ సంజయ్ రిమాండ్ ఖైదీగా జైలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సంజయ్ తరపు వాదనలు విన్న ధర్మసనం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచాణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
కాగా గతంలో సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను వరుసగా డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు ఈసారి విచారణ చేపట్టడంతో కీలక పరిణామంగా చూస్తున్నారు. సంజయ్ కు ఈ ప్రయత్నంలో కచ్చితంగా బెయిల్ వస్తుందని పలువురు అంటున్నారు. గత ప్రభుత్వంలో సంజయ్ ఫైర్ సేఫ్టీ విభాగంలో పని చేశారు. ఆ సమయంలో నిధులు దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడ జైలుకు తరలించారు. ఆ తర్వాత రిమాండ్ గడువులను ధర్మాసనం పొడిగిస్తూ వస్తోంది. అలాగే సంజయ్ బెయిల్ పిటషన్లను డిస్మిస్ చేసింది.






