- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సస్పెండెడ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ పొడిగింపు
సస్పెండెడ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి మరోసారి ఏసీబీ కోర్టు షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: సస్పెండెడ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి మరోసారి ఏసీబీ కోర్టు షాకిచ్చింది. నేటితో ఆమె రిమాండ్ గడువు పూర్తి కానుండగా.. పోలీసులు కోర్టులో హాజరు పరిచి మరికొద్దిరోజులు రిమాండ్ కు ఇవ్వాలని కోరారు. విచారణకు సహకరించకపోవడంతో మరింత గడువు కోరడంతో.. విజయవాడ ఏసీబీ కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే పలుమార్లు శాంతికి రిమాండ్ పెంచుతూ వచ్చిన కోర్టు.. మళ్లీ రిమాండ్ విధించడంతో ఆమెకు ఊహించని షాక్ తగిలినట్లయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శాంతిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది మార్చిలో శాంతి ఇంటితోపాటు.. సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేసిన ఏసీబీ విశాఖపట్నంలో ఎండాడలో ఖరీదైన ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ+2 బిల్డింగ్, 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి అక్రమంగా ఉన్నట్లు తేల్చింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. ఏప్రిల్ 21వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. ఆ తర్వాత మరోసారి మే 5వ తేదీ వరకూ, మరో రెండు సార్లు కోర్టు రిమాండ్లు పొడిగించింది. తన వద్దనున్న బంగారం, వెండి తన తల్లి, బంధువులుగా కానుకలుగా ఇచ్చినవని, ఫ్లాట్లు , ఇళ్లు లోన్లు తీసుకుని కొన్నానని ఇప్పటికే విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.






