- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ దూకుడు.. సబ్ రిజిస్ట్రార్ ల నివాసాల్లో తనిఖీలు
అవినీతి నిర్మూలన విషయంలో ఏసీబీ (ACB) దూకుడును పెంచింది. అందులో భాగంగా ఏపీలోని పలు సబ్ రిజిస్ట్రార్ లు (Sub Registrars), కార్యాలయాల సిబ్బందికి సంబంధించిన అవినీతిపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : అవినీతి నిర్మూలన విషయంలో ఏసీబీ (ACB) దూకుడును పెంచింది. అందులో భాగంగా ఏపీలోని పలు సబ్ రిజిస్ట్రార్ లు (Sub Registrars), కార్యాలయాల సిబ్బందికి సంబంధించిన అవినీతిపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మంగళవారం ఏకకాలంలో సబ్ రిజిస్ట్రార్ లతో పాటు కార్యాలయ సిబ్బంది నివాసాల్లో తనిఖీలను నిర్వహించింది. సంబంధిత అధికారులు, సిబ్బందికి చెందిన 14 నివాస ప్రాంతాల్లో సోదాలను (Raids) చేపట్టింది. గత నెల కూడా రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలను నిర్వహించింది. తనిఖీల్లో దొరికిన ఆధారాలతో 4 కేసులను కూడా నమోదు చేసింది. ఈ క్రమంలో నేడు విశాఖలోని జగదాంబ సెంటర్, విజయనగరం జిల్లాలోని భోగాపురం, అనంతపురం జిల్లా చిలమత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్ల సబ్ రిజిస్ట్రార్ లు, కార్యాలయాల సిబ్బందికి సంబంధించిన నివాసాల్లో సోదాలను చేసి కీలక డాక్యుమెంట్లను సేకరించినట్లు తెలుస్తోంది.
భోగాపురంలో కీలక ఆధారాల సేకరణ
భోగాపురం సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలను నిర్వహించగా పలు కీలక డాక్యుమెంట్లు దొరికినట్లు సమాచారం. ఆ ఆధారాలతో సబ్ రిజిస్ట్రార్ నివాసాల్లో ఏసీపీ తనిఖీలను నిర్వహించింది. ఈ క్రమంలో సబ్ రిజిస్ట్రార్ కు సంబంధించినవిగా అనుమానిస్తున్న రూ.15లక్షల నగదు, బంగారం ఓ ప్రైవేటు ఏజెంట్ ఇంట్లో లభించాయి. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక ఆధారాలను సేకరించారు.






