- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:రేషన్ వ్యాన్లు రద్దు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
రేషన్ పంపిణీపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ(మంగళవారం) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రేషన్ పంపిణీపై ఏపీ కేబినెట్(AP Cabinet Meeting) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక పై రేషన్ వ్యానులు ఉండవని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపారు. ఇక నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులు బియ్యం తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో వచ్చే నెల(జూన్) నుంచి చౌకధర దుకాణాల ద్వారానే పీడీఎస్ బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. చౌకదుకాణాలు ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. చౌకధర దుకాణాల్లో గిరిజనుల ఉత్పత్తుల విక్రయానికి యోచిస్తున్నట్లు తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతాం అని మంత్రి నాదెండ్ల తేల్చి చెప్పారు. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాకా సరుకులు ఎటు వెళుతున్నాయో తెలియలేదు. ఒక్కో వాహనానికి నెలకు రూ.27వేల చొప్పున పౌర సరఫరా శాఖ చెల్లిస్తోంది. చాలా అంశాలపై నిర్ణయించి రేషన్ వ్యాన్లను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. దీపం-2 పథకం పై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని.. దీపం-2 కింద బుకింగ్ కు ముందే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.






