కృష్ణా నదిలో యువకుడి గల్లంతు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-03 12:16:28  IST  )

కృష్ణా నదిలో విహారయాత్రకు వెళ్లి యువకుడు గల్లంతయ్యారు...

కృష్ణా నదిలో యువకుడి గల్లంతు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా నది(Krishna Rivar)లో విహారయాత్రకు వెళ్లి యువకుడు గల్లంతయ్యారు. నీటి ప్రవాహాన్ని(Water Flowting) తట్టుకోలేక కొట్టుకుపోయారు. అయితే యువకుడు కొట్టుకుపోవడాన్ని గమన్నించిన మత్య్సకారులు వెంటనే అక్కడికి వెళ్లారు. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని రక్షించి ఒడ్డుకుచేర్చారు. ఇలా కొద్దిలో యువకుడికి ప్రమాదం తప్పింది.

కాగా ఈ రోజు ఉదయం శ్రీశైలం - పాతాళ గంగకు నలుగురు యువకులు వెళ్లారు. శ్రీశైలం డ్యామ్ దిగువన కృష్ణా నది పుష్కర ఘాటు(Pushkar Ghat)లో పుణ్యస్నానానికి దిగారు. ఇంతలో నీటి ప్రవాహం ఉధృతి పెరిగింది. దీంతో నలుగురు యువకుల్లో ఒకరు కొట్టుకుపోవడంతో మత్య్సకారులు సమయస్పూర్తి ప్రదర్శించారు. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడటంతో వారిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story