- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ విఫలం.. యువకుడు సూసైడ్
ప్రేమ విఫలంకావడంతో మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది..భీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన యువకుడు అప్పలరాజు.. ఓ యువతి ని కొంతకాలంగా ప్రేమించారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ విఫలంకావడంతో మనస్థాపం చెందిన 29 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా(Visakha District)లో జరిగింది. భీమిలి మండలం(Bheemili mandal) చేపలుప్పాడ(Chepaluppada)కు చెందిన యువకుడు అప్పలరాజు(Youty Appalaraju).. ఓ యువతి(Youth Gils)ని కొంతకాలంగా ప్రేమించారు. అయితే తన ప్రేమ విషయాన్ని ఇటీవల యువతికి తెలియజేశారు. కానీ ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపం చెందిన అప్పలరాజు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
ఈ ఘటనలో..
అయితే ఈ ఘటనలో అప్పలరాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి ఆయనను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కొద్దిసేపటికి చికిత్స పొందుతూ అప్పలరాజు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు అప్పలరాజుపై గతంలో రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంతోనే అప్పలరాజు ప్రేమను యువతి తిరస్కరించి ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం అప్పలరాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అప్పలరాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.






