ఏపీలో హైదరాబాద్ యువకుడి వీరంగం.. ఎందుకో తెలుసా..?

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి జిల్లా యలమంచిలిలో యువకుడు వీరంగం వేశారు..

ఏపీలో హైదరాబాద్ యువకుడి వీరంగం.. ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalle District) యలమంచిలి(Yalamanchili)లో యువకుడు వీరంగం వేశారు. ప్రేయసి కోసం హైదరాబాద్(Hyderabad) నుంచి వెళ్లిన కార్తిక్ రోడ్డుపై వాహనాలను ధ్వంసం చేశారు. సోషల్ మీడియాలో యువతిలో పరిచయం అయింది. దీంతో ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం వెతుక్కుంటూ యలమంచిలి వెళ్లాడు. రామ్ టిడ్కో ఏరియాలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపానికి గురయ్యారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై రాళ్ల దాడి చేశారు. ఈ మేరకు పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు కార్తిక్ కోసం గాలిస్తున్నారు.

Next Story