- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లోకి చొరబడి వ్యక్తిని నరికి చంపిన దుండగులు.. మహిళ పరిస్థితి విషమం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో తల్తీకొడుకుపై దుండగులు కత్తులతో దాడులకు దిగారు...

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో హత్యలు మరీ ఎక్కువయ్యాయి. చిన్న, చిన్న విషయాలకే కొందరు విచక్షణ కోల్పోతున్నారు. ఎదురుంది కుటుంబ సభ్యుడైనా, స్నేహితుడు, పరాయి వ్యక్తి అనే తేడా లేకుండా దారుణానికి ఒడిగడుతున్నారు. కత్తులతో దాడి చేసి చంపేస్తున్నారు.గంజాయి వ్యవహారంలో నెల్లూరులో సీపీఎం నేత పెంచలయ్య హత్య సంచలన రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మర్చిపోకముందే రాష్ట్రంలో మరో క్రైమ్ కలకలం రేపింది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో తల్తీకొడుకుపై దుండగులు కత్తులతో దాడులకు దిగారు. పట్టపగలు ఇంట్లోకి చొరబడి కొడుకు సాంబశివరావును నరికి చంపారు. అడ్డుకోబోయిన తల్లి కృష్ణకుమారిపైనా దాడి చేశారు. ఈ ఘటనలో సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందగా తల్లి కృష్ణకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.






