- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుడా జస్ట్ మిస్.. పట్టాల మధ్యలో పడుకుని ప్రాణాలు కాపాడుకున్న కార్మికుడు
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లో పట్టాల మధ్యలో పడుకుని కార్మికుడు ప్రాణాలు కాపాడుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు సమయస్పూర్తితో తప్పించుకోవాలని అంటారు. కానీ, చాలా చోట్ల భయపడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలే జరిగాయి. తాజాగా ఓ కార్మికుడు(Worker) చాలా తెలివిగా ప్రాణముప్పు నుంచి బయటపడ్డారు. రెప్పపాటులో పోవాల్సిన ప్రాణాలను కాపాడుకుని మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ భూమి మీద తనకు ఇంకా నూకలు ఉన్నాయని నిరూపించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా(Rangareddy District) తిమ్మాపూర్ రైల్వే స్టేషన్(Timmapur Railway Station) దగ్గర జరిగింది.
కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ దాటేందుకు ఓ కార్మికుడు ప్రయత్నించారు. అయితే అక్కడున్న గూడ్స్ రైలు(Goods Train) సడెన్‌గా కదిలింది. దీంతో వెంటనే రైలు పట్టాలపై పడుకున్నారు. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైలు వెళ్లిపోయిన తర్వాత దేవుడా అంటూ లేచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యమలోకాన్ని దగ్గర నుంచి చూసి తిరిగి వచ్చాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






