- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోలు పోస్తుండగా చెలరేగిన మంటలు.. చిన్నారి పరిస్థితి విషమం
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావిలో విషాదకర ఘటన జరిగింది. ఓ దుకాణంలో బైక్‌కు పెట్రోలు పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావి(Gonbavi)లో విషాదకర ఘటన జరిగింది. ఓ దుకాణం(Shop)లో బైక్(Byke)కు పెట్రోలు పోస్తుండగా ఒక్కసారిగా మంటలు(Fire) చెలరేగాయి. దీంతో వాహనంపై ఉన్న దంపతులతో పాటు వారి వెంట ఉన్న చిన్నారికి మంటలు అంటుకున్నాయి. స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దంపతులకూ గాయాలు
మరోవైపు దంపతులకు సైతం శరీరమంతా గాయాలయ్యాయి. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. బహిరంగంగా విక్రయించే పెట్రోల్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఘటనకు కారణమైన దుకాణం దారుడిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






