విశాఖలో పండగరోజు విషాదం.. బీటెక్ విద్యార్థి మృతి

by Vemula.Srinu Prasad |

విశాఖలో పండగరోజు విషాదం చోటు చేసుకుంది. పండగ, ఆదివారం కావడంతో సరదగా ఆరుగురు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు రుషికొండ బీచ్‌కు వెళ్లారు...

విశాఖలో పండగరోజు విషాదం.. బీటెక్ విద్యార్థి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Vishaka)లో పండగరోజు విషాదం(Tragedy) చోటు చేసుకుంది. పండగ, ఆదివారం కావడంతో సరదగా ఆరుగురు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు రుషికొండ బీచ్‌(Rushikonda Beach)కు వెళ్లారు. సముద్ర తీరంలో ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగారు. అయితే ఒక్కసారిగా అలలు ఎగిసిపడటంతో విద్యార్థి పి. అరవింద్ కృష్ణ నీటిలో కొట్టుకుపోయారు. దీన్ని గమనించి రాజీవ్.. తన స్నేహితుడు అరవింద్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఇద్దరూ కూడా నీటిలో కొట్టుకుపోయారు. మిగిలిన స్నేహితుల అరుపులు, కేకలు విన్న బ్లూబీచ్ లైఫ్ గార్డ్ సిబ్బందితో పాటు బోటింగ్ యాజమాన్యం సముద్రంలోకి వెళ్లి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. అయితే వీరిలో అరవింద్ కృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి అరవింద్ కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అరవింద్ కృష్ణ స్వస్థలం రాజమండ్రి కాగా విశాఖ కొమ్మదిలోని గాయత్రి విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story