- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tragedy: గోదావరిలో స్నానం.. ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదారి జిల్లా(East Godavari District) కొవ్వూరు మండలం చిగురులంక(ChiguruLanka)లో విషాదం చోటు చేసుకుంది. గోదావరి(Godavari)లో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. చిగురులంకకు చెందిన ఇద్దరు యువకులు గోదావరి నది వద్దకు వెళ్లారు. నది ఒడ్డున కూర్చుని సరదాగా మాటలు చెప్పుకున్నారు. కొంతసేపటికి స్నానం చేసేందుకు నదిలోకి ఓ యువకుడు దిగారు. అయితే ప్రమాదవశాత్త యువకుడు నీళ్లలో గల్లంతయ్యారు. దీంతో రెండో యువకుడు నదిలోకి దిగారు. అయితే ఇద్దరూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక మృతి చెందారు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన గోదావరి వద్దకు చేరుకున్న పోలీసులు.. ఇద్దరు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా, సరదాగా కనిపించే ఇద్దరు యువకులు ఇక లేకపోవడంతో చిగురులంక గ్రామస్తులు కన్నీరు మున్నీరు అయ్యారు.