- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రాలయంలో తీవ్ర విషాదం: నదిలో ఐదుగురు గల్లంతు.. ఒకరి మృతి
by Vemula.Srinu Prasad |
కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. సమీపంలోని నది వద్దకు ఐదుగురు యువకులు వెళ్లారు. హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర, సతీశ్, మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను, ఉరవకొండకు చెందిన సంథ్య ఈతకు కొట్టేందుకు నదిలో దిగారు..

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) మంత్రాలయం(Mantralayam)లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. సమీపంలోని నది(River) వద్దకు ఐదుగురు యువకులు వెళ్లారు. హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర, సతీశ్, మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను, ఉరవకొండకు చెందిన సంథ్య ఈతకు కొట్టేందుకు నదిలో దిగారు. అయితే అకస్మాత్తుగా వారంతా నదిలో గల్లంతయ్యారు. స్థానికులు చూస్తుండగా నీటిలో మునిగిపోయారు. దీంతో వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలం వద్దకు చేరుకుని గజ ఈతగాళ్లతో నదిలో గాలిస్తున్నారు. అయితే వీరిలో ఒకరు మృతి చెందగా.. మరొకరిని రక్షించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు హైదరాబాద్ కు చెందిన ఇద్దరిలో ఒకరిదిగా చెబుతున్నారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Next Story






