- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాళ్లతో పగలగొట్టి ఏటీఎం చోరీకి యత్నం... దొంగ అరెస్ట్
కాకినాడ జిల్లా తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి ఓ దుండగుడు యత్నించారు. ..

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) తుని(Tuni)లో ఎస్బీఐ ఏటీఎం(SBI ATM) చోరీకి ఓ దుండగుడు యత్నించారు. ఏటీఎం మిషన్‌ను రాళ్లతో పగలగొట్టి నగదు తీసుకెళ్లేందుకు ప్రయత్నంచేశారు. అయితే ఎంత ప్రయత్నం చేసినా డబ్బు బయటకు తీయలేకపోయారు. చేసేదమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ తంతగం అంతా సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయింది.
దీంతో విజయవాడ ఎస్బీఐలోని సెంట్రల్ సర్వేలెన్స్ లో దొంగను గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే తునిలో గాలించిన పోలీసులు వెంటనే దొంగను అరెస్ట్ చేశారు. గతంలో ఎక్కడైనా ఏటీఎంలో చోరీ చేశారా..?, మరేమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. చోరీలకు పాల్పడటం నేరమని, ఎక్కడైనా ఏటీఎం చోరీలకు పాల్పడుతుంటే స్థానికులు వెంటనే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.






