డాక్టర్ వేషంలో.. మొబైల్ ఫోన్ లు ఎత్తుకెళ్లే దొంగ.!

by Geesa Chandu |

మొబైల్ ఫోన్ లను దొంగిలించే ఒక దొంగ ఇప్పుడు డాక్టర్ అవతారమెత్తాడు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆఫీసులు, హాస్పిటల్స్ లలో జనాలను బురిడీ కొట్టించి, తన మాటలతో మాయ చేసి, వారినుంచి ఇట్టే సెల్ఫోన్ లను మాయం చేస్తాడు.

డాక్టర్ వేషంలో.. మొబైల్ ఫోన్ లు ఎత్తుకెళ్లే దొంగ.!
X

దిశ, వెబ్ డెస్క్: మొబైల్ ఫోన్ లను దొంగిలించే ఒక దొంగ ఇప్పుడు డాక్టర్ అవతారంమెత్తాడు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆఫీసులు, హాస్పిటల్స్ లలో జనాలను బురిడీ కొట్టించి, తన మాటలతో మాయ చేసి, వారినుంచి ఇట్టే సెల్ఫోన్ లను మాయం చేస్తాడు. అయితే ఈ దొంగ ఇప్పుడు తన రూటు మార్చాడు. తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తిని తన మాటలతో ట్రాప్ లో పెట్టి డబ్బులు దొంగిలించే క్రమంలో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.

వివరాల్లోకెళ్తే...

ఆగస్టు 9 (శుక్రవారం) మధ్యాహ్నం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మదనపల్లెకు చెందిన అశోక్ అనే వ్యక్తి, తన కుమార్తెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చాడు.అయితే అదే సమయానికి ఆసుపత్రిలో డాక్టర్ లాగా ఒంటిపై తెల్ల కోటు, మెడలో స్టెతస్కోపును ధరించి ఉన్న ఈ సెల్ఫోన్ల దొంగ.. అశోక్ కు నిజమైన డాక్టర్ లా ఎదురుగా వచ్చి కనిపించేసరికి, తన కుమార్తె పరిస్థితి గురించి చెప్పుకున్నాడు. అయితే డాక్టర్ వేషంలో ఉన్న ఆ దొంగ, అశోక్ ఫోన్ ను అడిగి తీసుకొని మాటల్లో పెట్టి, అదే సమయంలో అశోక్ ఫోన్ నుండి 40 వేల రూపాయలను దొంగ తన ఫోన్ కు యూపీఐ ద్వారా డబ్బులను బదిలీ చేసుకున్నాడు. తర్వాత ఈ ఘటనతో వెంటనే తేరుకున్న అశోక్, రుయా అసుపత్రిలోని పోలీసులకు ఫిర్యాదు చేయుయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు తిరుపతి రోడ్డులోని గరుడ సర్కిల్ వద్ద చాకచక్యంగా.. దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ దొంగ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నరసంపల్లి తాండకు చెందిన సాయికుమార్ గా పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

Next Story