తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన దొంగ.. 150 గ్రాముల బంగారం చోరీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-14 12:01:50  IST  )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో దొంగ రెచ్చిపోయాడు. పట్టపగలు గోల్డ్ షాపులోకి ప్రవేశించిన దుండగుడు 150 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లాడు. సింపుల్‌గా స్కూటీపై వచ్చిన దొంగ బంగారం కొనుగోలుదారుడి మాదిరిగా షాపులోకి ప్రవేశించాడు..

తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన దొంగ.. 150 గ్రాముల బంగారం చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District) సూళ్లూరుపేట(Sullurpet)లో దొంగ రెచ్చిపోయాడు. పట్టపగలు గోల్డ్ షాపులోకి ప్రవేశించిన దుండగుడు 150 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లాడు. సింపుల్‌గా స్కూటీపై వచ్చిన దొంగ బంగారం కొనుగోలుదారుడి మాదిరిగా షాపులోకి ప్రవేశించాడు. బంగారం చూపించమన్నాడు. దీనికి యజమాని బంగారు గొలుసు చూపించాడు. వెంటనే జేబులోంచి కారం తీసి షాపు యజమాని కళ్లలో చల్లి అక్కడున్న బంగారాన్ని తీసుకుని పారిపోయాడు. ఈ దృశ్యాలు షాపులోని సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఈ చోరీపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. స్కూటీ నెంబర్, స్థానిక సీసీ టీవీ పుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు.

Next Story